చిత్రం చెప్పే విశేషాలు..!

(12-08-2022/2)

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌ ఖాతాలో ఏనుగుల ఫొటోలను పంచుకున్నారు. ఆసియాలోని 60శాతం ఏనుగులు భారతదేశంలోనే ఉండటం గొప్ప విషయమని తెలుపుతూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు వారి అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకొన్నారు.

Source: Eenadu

రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Source: Eenadu

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో భారీ జాతీయ జెండాతో ప్రదర్శన ఇచ్చారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని టోలిచౌకి ఇలాహీ మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు, స్థానికులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.

Source: Eenadu

శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Source: Eenadu

బ్రసెల్స్‌లో శుక్రవారం ఫ్లవర్‌ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. 1971 నుంచి ఏటా ఇక్కడ ఫ్లవర్‌ కార్పెట్‌ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 120 మందికి పైగా వాలంటీర్లు సుమారు 4గంటలపాటు శ్రమించి 4లక్షలకుపైగా పూలతో ఈ కార్పెట్‌ను తీర్చిదిద్దారు.

Source: Eenadu

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి బర్కత్‌పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. తోబుట్టువులకు దూరంగా ఉండి విధుల్లో నిమగ్నమైన తనకు రాఖీ కట్టడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

Source: Eenadu

ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్నానఘట్టాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home