చిత్రం చెప్పే విశేషాలు..!
(31-10-2022/1)
పక్షులు నివాసం ఉండడానికి గూళ్ల నిర్మాణంలో ప్రత్యేకతను చాటుకుంటాయి. మనిషి మేథస్సుకు మించి అల్లికలు చేస్తుంటాయి. అలా కట్టుకుంటూ ఒకదానికొకటి పోటీ పడుతూ అందంగా మల్చుకుంటున్న దృశ్యాలు నిర్మల్ జిల్లా గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామ శివారులో కనిపించాయి.
Source:Eenadu
వర్షాల కారణంగా రహదారులు కోతకు గురికావడంతో రెవెల్లి-దేశాయిపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు నెలలుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Source:Eenadu
కరీంనగర్‌లోని తిమ్మాపూర్ ఎల్‌ఎండీ జలాశయం కట్ట సమీపంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో రైతులు ధాన్యం రాశులను పోస్తున్నారు. దీంతో పోలీసు ఉద్యోగాల సాధకులకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
Source:Eenadu
హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై కొందరు వాహన చోదకులు మాస్కులను తమ వాహన నెంబర్లు పోలీసుల నిఘా నేత్రంలో నమోదవకుండా జాగ్రత్త పడుతున్నారు. వెల్దండ వద్ద ఓ వాహనచోదకుడు నంబర్ ప్లేట్ కన్పించకుండా మాస్కును అడ్డుగా పెట్టుకొని వెళ్తున్న దృశ్యం.
Source:Eenadu
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మారుమూల మండలమైన నాంపల్లి అంబేడ్కర్‌లో చౌరస్తాలో వాహనాల రద్దీ పట్టణ కూడళ్లను మించిపోతోంది. ఒక్క సొంత కారూ లేని గ్రామంలో కూడా ఖరీదైన పెద్ద వాహనాలు తిరుగుతుంటే ఓటర్లు ముక్కున వేలేసుకొని తిలకిస్తున్నారు.
Source:Eenadu
త్వరలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కాజీపేట నుంచి బల్లార్షా వరకు తనిఖీలు నిర్వహించనున్నారు. కాజీపేట స్టేషన్ పరిధిలో పట్టాలపై చెత్త లేకుండా కూలీలను పెట్టి ఏరిస్తున్నారు.
Source:Eenadu
ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఆధార్ నవీకరణ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. చిన్న వయసులో ఆధార్ నమోదు చేసుకొని నవీకరణ కోసం ఎదురు చూస్తున్న 20 మందికి కొత్తగా ఆధార్ నమోదు పూర్తిచేశారు.
Source:Eenadu
అసలే చలికాలం. వరంగల్ నగరంలో వాయు కాలుష్యంతో పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో దట్టంగా అలముకున్న పొగ చూడగానే ఉలిక్కిపడ్డారు. తీరా దోమలను పారదోలడానికి ఇలా వీధుల్లో ఫాగింగ్ చేస్తున్నారని తెలిశాక కాస్త కుదుటపడ్డారు.
Source:Eenadu