చిత్రం చెప్పే విశేషాలు..!

(01-11-2022/1)

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద ఆయన నివాళులర్పించారు. 

Source: Eenadu

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా తన నివాసంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

Source: Eenadu

సోమవారం హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నటి ఎల్.విజయలక్ష్మికి ఎన్టీఆర్ శత జయంతి పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Source: Eenadu

సర్దార్‌ వల్లబ్‌భాయిపటేల్‌ జయంతిని పురస్కరించుకుని గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు సోమవారం సబ్బుబిళ్లపై ఆయన చిత్రాన్ని గీసి నివాళులర్పించారు.

Source: Eenadu

కేపీహెచ్‌బీ మలేసియన్‌ టౌన్‌షిప్‌లో సోమవారం సాయంత్రం కార్తిక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. టౌన్‌షిప్‌ వాసి పెన్మత్స రామరాజు ఆధ్వర్యంలో టౌన్‌షిప్‌ ప్రాంగణంలో 4 వేలకుపైగా దీపాలు వెలిగించారు.

Source: Eenadu

సహజసిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు కలుషితమవుతోంది. గుడివాకలంక సమీపంలో వ్యర్థాలను కుప్పలుగా పోస్తున్నారు. సరస్సులో పశువులను దించరాదని, కలుషితం చేయొద్దంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా పట్టించుకునేవారు లేరు.

Source: Eenadu

పడకలు సరిపడా లేకపోవడంతో సోమవారం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కాన్పుల అనంతరం ఇలా ఒకే పడకపై ఇద్దరేసి బాలింతలను పడుకోబెట్టారు. పడకలు సరిపోకపోవడం వల్లే సర్దుబాటు చేయాల్సి వస్తోందని అక్కడి సిబ్బంది తెలిపారు.

Source: Eenadu

పెరిగిన చలిలో వెళ్తున్న వాహనదారులనుకుంటే మీరు పొరబడినట్లే. రోడ్డు వేసేందుకు తవ్వారు. ఇతర కారణాలతో పనులు ఆగాయి. దీంతో లేస్తున్న దుమ్ముతో లుంబిని., ఎన్టీఆర్‌ పార్కులకు వచ్చే సందర్శకులు, వాహనదారులు సతమతమవుతున్నారు.

Source: Eenadu

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అందుకోసం తీసుకొచ్చిన రకరకాల పూలు ఇవి.

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home