చిత్రం చెప్పే విశేషాలు..!
(03-11-2022/1)
ఆదోని ప్రాంతీయ ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే సిబ్బందికి కష్టాలు తప్పడంలేదు. ఆస్పత్రిలోని మెడికల్ గదిలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఔషధ విభాగం సిబ్బంది మొబైల్ టార్చ్ వెలుగులో మాత్రలు పంపిణీ చేశారు.
Source:Eenadu
బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి రావటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మండలంలోని నందిపేట శివారులోని 20 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ఆయన రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చారు.
Source:Eenadu
పురాతన కాలం నాటి పెద్ద బండరాళ్ల మధ్య, పచ్చని చెట్ల తీగల కింద గుహలో నుంచి ప్రయాణాలు సాగిస్తారు. కొత్తవారికి ఆహ్లాదం కలిగిస్తుంది. ఎంతో ఆకర్షణీయంగా కన్పిస్తున్న ఈ ప్రదేశం ఎక్కడో కాదు.. ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలోనిది.
Source:Eenadu
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప నగరంలో పాత రిమ్స్‌కు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. వాహనచోదకులు, పాదచారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. దీంతో అంబులెన్స్ చోదకులు మట్టితో ఆ గుంతలను మట్టితో పూడ్చే పనులు చేపట్టారు. ఆ చిత్రమే ఇది.
Source:Eenadu
రానున్న క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని విశాఖ సూర్యబాగ్‌లోని డాల్ఫిన్ హోటల్‌లో బుధవారం చెఫ్ డి.వి.నాయుడు ఆధ్వర్యంలో 15 రకాల డ్రైఫ్రూట్స్, నట్స్, ఆల్కహాలుతో ‘కేక్ మిక్సింగ్’ చేశారు.
Source:Eenadu
బిట్రగుంట రైల్వేస్టేషన్‌కు పడమర రైల్వే అతిథి గృహం నుంచి కొత్తూరు దాకా ఉన్న రైల్వే రోడ్డు దారుణంగా తయారైంది. బుధవారం కురిసిన భారీ రోడ్డు జలమయమైంది. ఐదేళ్లుగా మరమ్మతులే లేకపోవడంతో రోడ్డు గోతులు పడి దారుణంగా తయారైంది.
Source:Eenadu
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండకు బుధవారం ఉదయం పర్యటకులు పోటెత్తారు. పాల సముద్రాన్ని తలపించే మంచు అందాలను తిలకించేందుకు తరలివచ్చారు.
Source:Eenadu
ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు రాకపోకలు సాగిస్తున్న ఓ ఆర్టీసీ బస్సుకు అద్దాలు పగిలిపోయాయి. చివరిన ఉన్న కిటికీకి అట్టముక్కల్ని అడ్డుపెట్టి గాలి, దుమ్ము లోపలికి రాకుండా ఇలా ఏర్పాటు చేశారు.
Source:Eenadu