చిత్రం చెప్పే విశేషాలు..!

(06-11-2022/2)

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సెట్లో.. ‘భోళా శంకర్‌’ దర్శకుడు మెహర్‌ రమేశ్‌ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. సోమవారం నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌ పుట్టినరోజు కూడా కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

Source: Eenadu

ఆదిలాబాద్‌ పట్టణంలో కొందరు ద్విచక్ర వాహనదారులు సరైన నంబరు ప్లేట్లు లేకుండానే రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇలాంటి వారి ఆట కట్టించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Source: Eenadu 

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఓ నూతన బ్యూటీ సెలూన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu 

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడంతో తెరాస శ్రేణులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సంబరాలు చేసుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి, రంగులు చల్లుకొని వేడుక చేసుకున్నారు.

Source: Eenadu 

అమెరికన్‌ గాయని, నటి ఒలివియా రోడ్రిగో లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించిన ‘రాక్‌ అండ్‌ రోల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ వేడుకలో పాట పాడి సందడి చేశారు.

Source: Eenadu 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆదివారం సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్‌ల మీదుగా సాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్‌ తన సెల్‌ఫోన్‌లో ఓ దున్నపోతును ఫొటో తీస్తూ కనిపించారు.

Source: Eenadu 

హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ సంస్థ ఆదివారం ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పోను ప్రారంభించింది. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపుతో పాటు పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు.

Source: Eenadu 

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన భారత్‌, జింబాబ్వే మ్యాచ్‌లో భువీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికి ఓపెనర్‌ మధెవెరె (0) క్యాచ్‌ ఔటయ్యాడు. ఈ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టిన కోహ్లీ.. క్యాచ్‌ పట్టిన తీరును చూసి తానే ఒకింత నమ్మలేకపోయాడు.

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home