చిత్రం చెప్పే విశేషాలు!

(07-11-2022/1)

విజయనగరంలోని రామనారాయణం ఆలయంలో ఆదివారం రాత్రి రామ ధనస్సు ఆకారంలో కార్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. సుమారు 6వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. శివ నామస్మరణతో ఆలయ ఆవరణ మార్మోగింది. 

Source: Eenadu

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఓ నగల దుకాణం నూతన బ్రాంచి ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. కార్యక్రమంలో సినీనటి రాశీసింగ్‌ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలు ధరించి సందడి చేశారు.

Source: Eenadu

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. దైవారాధనలు, దర్శనాల కోసం భక్తులు గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. 1349 జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించాయి.

Source: Eenadu

కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని మల్లాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ ఇది. ఇక్కడ 7 వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ రోడ్డు సౌకర్యం లేదు. స్థలం చదును చేసి, పునాదుల పనులు చేపట్టాలని చూడగా ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి.

Source: Eenadu

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్‌ గట్టెం వెంకటేష్‌ పెన్సిల్‌ ముల్లుపై నందీశ్వరుడి రూపాన్ని మలిచాడు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఎనిమిది మిల్లీమీటర్ల ఎత్తు, పది మిల్లీమీటర్ల వెడల్పుతో దీన్ని తయారు చేశాడు.

Source: Eenadu

రాజధాని అమరావతికి అన్ని అడ్డంకులు తొలగిపోవాలని ప్రార్థిస్తూ మందడం గ్రామ శివాలయంలో మహిళలు రుద్రాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణం జరిగేలా చూడాలని దేవుడిని ప్రార్థించినట్లు వారు తెలిపారు.

Source: Eenadu

సాధారణంగా కంద దుంపలు పొడవుగా లేదా గుండ్రంగా ఉంటాయి. అయితే అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని ఓ వారపు సంతకు ఉర్రాడ నిమ్మలపాడు గ్రామం నుంచి చిన్నలమ్మ అనే గిరి మహిళ రోలు ఆకారంలో ఉన్న కంద దుంపలను అమ్మకానికి తీసుకొచ్చారు. వీటిని చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

Source: Eenadu

శీతాకాలంలో సువాసనలు వెదజల్లే మొక్కలు రంగురంగుల పూలతో హొయలు ఒలకబోస్తున్నాయి. పచ్చికబయళ్లలో కనిపించే అత్తిపత్తి మొక్క (టచ్‌ మీ నాట్‌) పూలు గులాబీ వర్ణంలో ఆకట్టుకుంటున్నాయి. సన్నటి తీగలతో గోళాకారంలో అలరిస్తున్నాయి. 

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home