చిత్రం చెప్పే విశేషాలు..

(08-11-2022/2)

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ తన అభిమాన హీరో సల్మాన్‌ఖాన్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలిసి నటిస్తూ ఓ ‘రీల్‌’ కూడా తీసుకున్నారు. ఇన్నేళ్ల నా నిరీక్షణ ఫలించింది అంటూ నిఖత్‌ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు.

Source: Eenadu

సిక్కు మత గురువు గురు నానక్‌ జయంతి సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న ఓ మహిళ.

Source: Eenadu

మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యాలయాలకు వెళ్లారు. ఎన్నికల్లో సహకరించిన ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు, ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్స్‌ నుంచి మెటల్‌ చార్మినార్‌ వరకు రహదారికి ఇరువైపులా రూ.లక్షలు వెచ్చించి పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ వేశారు. కానీ వాహనాల పార్కింగ్‌తో పాదచారులు, సైక్లిస్టులు ప్రమాదకరంగా రహదారిపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Source: Eenadu

కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జపాన్‌’. ఇవాళ చిత్రీకరణ ప్రారంభమైంది. అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో కథానాయిక.

Source: Eenadu

భాజపా కురువృద్ధుడు ఎల్‌కే అడ్వాణీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అడ్వాణీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

Source: Eenadu

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో అన్నాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు.

Source: Eenadu

సిక్కుల మత గురువు గురునానక్‌ జయంతి సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సిక్కులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home