చిత్రం చెప్పే విశేషాలు..!

(09-11-2022/2)

ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12న పెద్దపల్లి జిల్లాలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పర్యటించనున్నారు. ఆ ఏర్పాట్లను కేంద్రమంత్రి భగవంత్‌ కూబా.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తదితరులతో కలిసి పరిశీలించారు.

Source: Eenadu

రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏలూరులోని రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయిన రైళ్లు, ప్రయాణికులను ఈ చిత్రాల్లో చూడొచ్చు.

Source: Eenadu

పంజాబ్‌ రాష్ట్రం ఫిరోజ్‌పూర్‌ సమీపంలోని పాక్‌ సరిహద్దు గ్రామమైన గండూ పంట పొలాల్లో ఓ డ్రోన్‌ లభ్యమైంది. ఇది పాక్‌ వైపు నుంచి వస్తుండగా గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. దానిని స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపించారు..

Source: Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ధానోరా(బీ) గ్రామ విఠల్‌ రుక్మిణి ఆలయంలో కార్తిక మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌ రాయదుర్గంలో ఇటీవల ప్రారంభించిన ఓ బ్యూటీ సెలూన్‌లో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని హంస నడకతో ఆకట్టుకున్నారు.

Source: Eenadu

హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వాగులు, వంకలు దాటి వస్తున్న ప్రజలు.

Source: Eenadu

పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో పూల రెమ్మలు, ఆకులు, కాయలు తదితరాలతో అందమైన కళాకృతులు తయారు చేయడంలో మహిళలకు శిక్షణనిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తీర్చిదిద్దిన ఆకృతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Source: Eenadu

టీ20 వరల్డ్‌కప్‌ పోటీల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ సందర్భంగా ఓ పాక్‌ ఫ్యాన్‌ తన సంబరాన్ని వ్యక్తపరుస్తూ ఈ ప్లకార్డును పట్టుకున్నాడు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఏర్పాటు చేయనున్న నూతన నగల దుకాణానికి సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడళ్లు పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పలువురు విశ్రాంత సైనికులు హాజరయ్యారు. వారంతా ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడుతూ కనిపించారిలా.

Source: Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home