చిత్రం చెప్పే విశేషాలు..!
(13-11-2022/1)
నెల్లూరు జిల్లా ఉలవపాడులోని ఒక ఏటీఎం యూనిట్ వర్షానికి తడవకుండా శనివారం పాలిథిన్ పట్టా కప్పారు. ఏటీఎం కేంద్రం పైకప్పు వర్షానికి ఉరుస్తోంది. దీంతో యంత్రాలు పాడవకుండా ఉండేందుకు పాలిథిన్ పట్టా ఏర్పాటు చేశారు.
source: eenadu
సాధారణంగా సీతాకోకచిలుకలు రంగురంగుల్లో ఎంతో అందంగా ఉంటాయి. కానీ ఇది శ్వేతవర్ణంలో వింత గొలుపుతుంది. దీన్ని చూసినవారు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఇది నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని చిత్తలూరులోని నిమ్మ తోటల్లో విహరిస్తుంది.
source: eenadu
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలో పాలీ క్రిస్టలైన్ సోలార్ ప్యానెళ్లతో కార్ల పార్కింగ్ షెడ్డును వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంగణంలో వేలాదిగా అమర్చిన సోలార్ ప్యానెళ్లతో 1.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
source: eenadu
మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లా సెమాల్కేడి గ్రామంలో ఓ మేక వింత ఆకారంలో ఉన్న పిల్లకు జన్మనిచ్చింది. ముందు నుంచి చూస్తే అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉంది. ఈ మేకపిల్ల జన్యులోపంతో పుట్టినట్లు పశువైద్యులు తెలిపారు.
source: eenadu
తెలంగాణ మ్యాజిక్ అకాడమీ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో రెండు రోజుల పాటు జరిగే ‘మాయాజాలం-2022’ అఖిల భారతి ఇంద్రజాల మహాసభ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ఇంద్రజాలికులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
source: eenadu
హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శనివారం మాదాపూర్‌లో చేపట్టిన రాధాగోవిందుల రథయాత్ర వైభవంగా సాగింది. దుర్గంచెరువు పార్క్ నుంచి సాయినగర్, అయ్యప్పసొసైటీ, సైబర్‌టవర్స్, శిల్పారామం మీదుగా హైటెక్స్ కమాన్ వరకు యాత్ర సాగింది.
source: eenadu
ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అక్రమ పార్కింగ్, అతివేగంతో వెళ్లే వారిని అదుపు చేసేందుకు వీలుగా కొత్తగా ట్రాఫిక్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఎండా, వానల నుంచి సిబ్బందికి రక్షణ కల్పించేలా.. ఆకట్టుకునేలా వీటిని తీర్చిదిద్దారు.
source: eenadu
హిమాచల్‌ప్రదేశ్‌లోని భర్మౌర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో శనివారం ఓటు హక్కును వినియోగించుకునేందుకు మంచులో నడుచుకుంటూ వెళుతున్న ఓటర్లు.
source: eenadu