చిత్రం చెప్పే విశేషాలు!

(15-11-2022/2)

తిరుపతి ఎస్వీ మ్యూజిక్ కళాశాలలో మంగళవారం జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు యువతులు ఇలా గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి ఆకట్టుకున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో నిర్వహించిన సూత్ర ఎగ్జిబిషన్‌లో సినీ నటి మన్నారా చోప్రా పాల్గొన్నారు. నూతన డిజైన్ల ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

ఫిలిప్పీన్స్‌ మనీలాలోని టోన్డోలో జన్మించిన ఆడ శిశువు వినీస్‌ మబన్‌సగ్‌తో ప్రపంచ జనాభా 800కోట్లకు చేరింది. దీంతో ఫిలిప్పీన్స్‌లోని జనాభా, అభివృద్ధి కమిషన్‌ ఆధ్వర్యంలో వేడుకను నిర్వహిస్తున్నారు.

Source: Eenadu

ప్రముఖ సినీనటుడు కృష్ణ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్‌ ఆయన ఇంటికి వెళ్లి మహేశ్‌బాబును పరామర్శించారు..

Source: Eenadu

లాస్ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియంలో ‘గ్లాస్‌ ఆనియన్‌: ఏ నైవ్స్‌ ఔట్‌ మిస్టరీ’ సినిమా ప్రీమియర్‌ ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమానికి ఆ సినిమాలోని నటి మేడ్‌లిన్‌ క్లైన్‌ హాజరై ఫొటోలకు పోజలిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో ఒకరికొకరు విష్‌ చేసుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.

Source: Eenadu

జీ20 సదస్సు కోసం బాలి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో వివిధ అంశాలపై చర్చించారు.

Source: Eenadu

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. కార్యక్రమంలో తితిదే ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (25-04-2024/1)

రెడ్‌ బ్యూటీ..

నేనే బొమ్మనైతే...

Eenadu.net Home