చిత్రం చెప్పే విశేషాలు..!

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని శివ్వన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఒకే గదిలో మూడు తరగతులను నిర్వహిస్తున్నారు. సరిపడా గదులు లేకపోవడంతో ఒకే గదిలో ఏడు, మూడు, నాలుగు తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు.

Source: Eenadu

బొబ్బిలి మండలంలోని భోజరాజపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వీరు. పారాదిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే వేగావతి నది దాటి వెళ్లాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో ప్రమాదకరంగా ఇలా ప్రయాణం సాగిస్తున్నారు.

Source: Eenadu

మొన్నటివరకు నిండు కుండలా ఉన్న నిర్మల్‌ జిల్లాలోని కడెం జలాశయం ఇప్పుడు వెలవెలపోయి కనిపిస్తోంది. వరదల వల్ల గేట్లలో చెత్త నిండి ఇప్పుడు 17 గేట్లను కిందికి దింపే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం డ్యాం మీద పేరుకు పోయిన చెత్తను సిబ్బంది తొలగిస్తున్నారు.

Source: Eenadu


చుట్టూ నీరు.. మధ్యలో కట్టడంపై ఉన్నవారిని చూస్తే అయ్యో పాపం.. వరద నీటిలో చిక్కుకుపోయారే అనుకుంటే పొరపడినట్లే.. వీరంతా మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని మున్నేరు వాగుపై సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణ పనులు చేస్తున్నారు.

Source: Eenadu


కృష్ణానదికి వరదజలాలు పోటెత్తాయి. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ తీరంలోని సప్తనదుల వద్ద ఉన్న సంగమేశ్వర క్షేత్రాన్ని కృష్ణమ్మ చుట్టుముట్టింది. సాయంత్రం 4 తర్వాత సంగమేశ్వరలింగం పూర్తిగా మునిగిపోయింది.

Source: Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 8 రోజులుగా ఆకాశం మేఘావృతమై.. వర్షం కురుస్తూనే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులను చీల్చుకుంటూ భానుడు రావడంతో పట్టణమంతా వెలుగులు వచ్చాయి.

Source: Eenadu

హైదరాబాద్‌ నగరంలో రహదారులపై వంపులు వాహన చోదకులను బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాల వేళ.. వేగంగా వచ్చే ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి కిందపడిపోతున్నాయి. మాసబ్‌ ట్యాంక్‌ వద్ద మార్గం ఇది.

Source: Eenadu

హైదరాబాద్‌ నగరానికి జలకళ వచ్చింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు నగరంలో పలు రిజర్వాయర్లు, చెరువులు అలుగు పారుతున్నాయి. నగర శివారు పెద్దఅంబర్‌పేట వద్ద వరద కాలువపై కత్వా పొంగిపొర్లుతున్న దృశ్యం.

Source: Eenadu

హైదరాబాద్‌ నగరంలో మరో తీగల వంతెన రానుంది. ఇప్పటికే దుర్గంచెరువుపై ఉన్న సంగతి తెలిసిందే. పాతబస్తీలోని మీరాలం చెరువుపై ఆరు లైన్లలో ఈ వంతెనను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేయనుంది. ఎన్‌హెచ్‌44తో దీన్ని అనుసంధానించనున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

గమనిక: ఇది ప్రయత్నించకండి

బాక్సర్‌ మీనాక్షి

Eenadu.net Home