చిత్రం చెప్పే విశేషాలు..!

(18-11-2022/2)

అమెరికాలోని అట్లాంటాలో మేసీ లెనాక్స్‌ స్క్వేర్‌ వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ ట్రీ. 45 వేల ఎల్‌ఈడీ లైట్లతో దీన్ని రూపొందించారు.

Source: Eenadu

హైదరాబాద్‌ అత్తాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వాచ్‌ షోరూం ప్రారంభోత్సవంలో నటి మన్నారా చోప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.

Source: Eenadu

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం ఓడరేవులో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సుకన్యను ప్రదర్శనకు ఉంచారు. దీంతో జిల్లా వాసులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నౌక విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.

Source: Eenadu

ఇటీవలే రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికాయి.

Source: Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతోంది. యాత్రలో మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ పాల్గొన్నారు. రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. 

Source: Eenadu

భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-ఎస్‌’ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Source: Eenadu

జపాన్‌లో గ్రాండ్‌ ప్రి ఫిగర్‌ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. యూఎస్‌కు చెందిన కరోలిన్‌ గ్రీన్‌, మిచెల్‌ అందులో పాల్గొన్నారు. తమదైన శైలిలో ఐస్‌ డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

Source: Eenadu

హుస్సేన్‌సాగర్‌ చెంత ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే రేస్‌లో పాల్గొనే కార్లు గురువారం హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరాయి. 30 పైనే కార్లను తీసుకొచ్చారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home