చిత్రం చెప్పే విశేషాలు..!
(22-11-2022/2)
నార్త్ కరోలినాలోని మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ చెర్రీ పాయింట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మిలటరీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ ఇలా సెల్ఫీ తీసుకున్నారు.
Source: Eenadu
హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే చాదర్‌ఘాట్-కోఠి ఉమెన్స్ కళాశాల రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు మొరాయించి నిలిచిపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మరికొందరు బస్సును పక్కకి నెట్టడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.
Source: Eenadu
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ బ్రాండ్ షూట్‌లో పాల్గొన్నారు. ఆయన లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అభిమానులు ఫిదా అవుతున్నారు.
Source: Eenadu
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగుతోంది. చిట్యాల మండలం దూతపల్లి వద్ద ఆమె కల్లుగీత కార్మికులతో మాట్లాడారు.
Source: Eenadu
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన నేటి ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
Source: Eenadu
ఇండోనేసియా దేశం పశ్చిమ జావాలోని చియాంజుర్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలిపోయిన తన ఇంట్లోని వస్తువుల కోసం ఓ వ్యక్తి ఇలా శోధిస్తూ కనిపించాడు.
Source: Eenadu
గతేడాది క్వింటా రూ.12వేలు దాటిన పత్తి ధర ఈ సారి రూ.8వేలకు మించడం లేదు. దీంతో పెట్టుబడి ఖర్చులు పోనూ మిగిలేది ఏమీ ఉండదని గ్రహించిన రైతులు తమ ఇళ్లలో, అద్దె ఇళ్లలో పత్తి నిల్వ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు రైతు నరేశ్ ఇలా తన ఇంట్లోనే పత్తి నిల్వ చేసుకున్నాడు.
Source: Eenadu
తిరుమలలో ఇవాళ మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. మంచు పడుతున్న రీతిలో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో భక్తులు ఆలయం వద్ద ఫొటోలు తీసుకుంటూ మురిసిపోయారు.
Source: Eenadu