చిత్రం చెప్పే విశేషాలు..

(24-11-2022/2)

టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్‌ మీర్జా, సోదరి ఆనమ్‌ మీర్జా కుమార్తె దువాతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తనకు తెలిసిన, తెలుసుకోవాలనుకుంటున్న స్వచ్ఛమైన ప్రేమ ఇదేనంటూ ఆమె పోస్టు పెట్టారు.

Source: Eenadu

పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. సినిమాలోని కీలక ఘట్టాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్‌లో అక్టోబర్‌ చివరి వారం నుంచి చిత్రీకరిస్తున్నారు. 

Source: Eenadu

మూసారాంబాగ్ మూసీ వంతెన వద్ద ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ సరిగా లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌లో నటి, మోడల్‌ శ్రీలేఖ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద వాటర్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలు, పిల్లలు సెయిలింగ్‌ నేర్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. 

Source: Eenadu

ఈ చిత్రాల్లో కన్పిస్తున్నవి పచ్చపీతలు(మడ్‌ క్రాబ్‌). పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీరంలో లభించే వీటికి మార్కెట్లో అధిక డిమాండ్‌ ఉంది. కిలో రూ.1200-1500 ధర పలుకుతున్నాయి.

Source: Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో సాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ సోదరి ప్రియాంక.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు.

Source: Eenadu

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో తీసుకున్న ఫొటోను ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీం హకీం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘RC15’ సినిమాలో చరణ్‌ లుక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు. 

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home