చిత్రం చెప్పే విశేషాలు!
(25-11-2022/2)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఖండవా జిల్లాలో సాగుతోంది. రాహుల్‌కు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్న ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఓ బాలికకు ఇలా షూ లేస్ కడుతూ కనిపించారు.
Source: Eenadu
గోవాలో నిర్వహించిన 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఇలా రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
Source: Eenadu
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చాలాకాలంగా ఇక్కడికి రావాలని వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు.
Source: Eenadu
సినీనటుడు వరుణ్ సందేశ్, వితికా శేరు దంపతులు ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రామానుజాచార్యుల విగ్రహం వద్ద ఫోటోలు తీసుకొని సందడి చేశారు.
Source: Eenadu
కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఖమ్మం జిల్లా ఈర్లపూడిలోని ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఇటీవల గొత్తికోయల దాడిలో శ్రీనివాసరావు హత్యకు గురైన సంగతి తెలిసిందే.
Source: Eenadu
బెల్జియంకు చెందిన యువతి కెమిల్, కర్ణాటకకు చెందిన ఆటోడ్రైవర్ అనంతరాజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్ల క్రితం హంపికి వచ్చిన ఆమెకు ఆటో డ్రైవర్, గైడ్ అనంతరాజుతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి కల్యాణం జరిగింది.
Source: Eenadu
దివంగత ఫుట్‌బాల్ క్రీడాకారుడు డీగో మారడోనా రెండో వర్ధంతి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించాడు.
Source: Eenadu
విశాఖలోని ఎంవీపీ డబుల్ రోడ్డులో విద్యుత్తు పనుల కోసం చెట్టు చుట్టూ మట్టి తవ్వారు. దీంతో వృక్షం నేలకొరగడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
Source: Eenadu