చిత్రం చెప్పే విశేషాలు..!

(27/11/2022/1)

సాధారణంగా బెండ మొక్కలు ఐదు అడుగుల వరకు పెరుగుతుంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని గంగాధరి దినేష్‌ ఇంటి ఆవరణలో పెరిగిన బెండ మొక్కను చూడాలంటే మాత్రం తల ఎత్తాల్సిందే. ఏకంగా 11 అడుగుల మేర ఎదిగి ఇంకా చిగురిస్తూనే ఉంది.

source : eenadu

కంటిచూపు లేని వారికి దారి చూపే కర్ర ఇది.. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఏదైనా వాహనం కాని, జంతువు కాని ఎదురొచ్చిన వెంటనే చేతిలో ఉన్న కర్రకు అమర్చిన సెన్సర్స్‌ అప్రమత్తం చేస్తాయి. దీన్ని అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు తయారుచేశారు.

source : eenadu

త్వరలో విశాఖ తీరంలో జరిగే నావికాదళ దినోత్సవానికి నేవీ సిబ్బంది ప్రత్యేక విన్యాసాలతో కసరత్తు చేస్తున్నారు. సాగరజలాల నుంచి తీరానికి వచ్చే ప్రత్యర్థులను ముట్టడించే విన్యాసాలు...బాంబులతో దాడి..తదితర నమూనా విన్యాసాలు ప్రజలు తిలకించారు. 

source : eenadu

హైదరాబాద్‌-సాగర్‌ ప్రధాన రహదారిలో తుర్కయాంజల్‌ వద్ద వాహనం ఢీకొనడంతో 33 కేవీ విద్యుత్తు టవర్‌ వంగిపోయింది. నెలన్నర గడుస్తున్నా మరమ్మతులు చేయడం లేదు. వాహనాలపై పడితే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది.

source : eenadu

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పూలమాలలు ముంచెత్తాయి.

source : eenadu

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో భారత్‌ జోడో యాత్రలో ప్రజలతో కలిసి నడుస్తున్న రాహుల్‌గాంధీ.

source : eenadu

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న కొత్తరాతియుగపు అమ్మదేవత మట్టి శిల్పం లభించినట్లు పురావస్తు పరిశోధకులు తెలిపారు.

source : eenadu

షష్ఠి తీర్థ మహోత్సవాల సందర్భంగా రావులపాలెం, అంబాజీపేట అరటి మార్కెట్‌లలో కొనుగోళ్ల సందడి మొదలైంది. ఈ నెల 29న షష్ఠి తీర్థమహోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి సమర్పించే కర్పూర రకం అరటి గెలల ధరకు రెక్కలొచ్చాయి.

source : eenadu

చిత్రం చెప్పే విశేషాలు (25-04-2024/1)

రెడ్‌ బ్యూటీ..

నేనే బొమ్మనైతే...

Eenadu.net Home