చిత్రం చెప్పే విశేషాలు..!

(28-11-2022/2)

రజనీకాంత్ నటించిన ‘బాబా’ చిత్రాన్ని డిసెంబర్‌ 12న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా కొన్ని సన్నివేశాలు జోడించినట్లు సమాచారం. వాటికి రజనీ డబ్బింగ్‌ చెబుతున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Source: Eenadu

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చివరి రోజైన నేడు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచి తితిదే అధికారులు, అర్చకులు పద్మావతి అమ్మవారికి సారె తీసుకొచ్చి సమర్పించారు.

Source: Eenadu

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ కొత్త సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మూడు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

Source: Eenadu

వెనెజువెలాలోని నేషనల్‌ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కారకస్‌లో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేందుకు పెద్ద ఎత్తున జంటలు తరలివచ్చి నృత్య ప్రదర్శన ఇచ్చాయి.

Source: Eenadu

ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న చిన్న విమానం ఆదివారం సాయంత్రం అమెరికాలోని మాంట్‌గోమరి గ్రామంలో ఇలా విద్యుత్తు తీగల లైన్‌లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు.

Source: Eenadu

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 38వ రోజు ఈ సినిమా కలెక్షన్లు.. అక్కడ విడుదలైన రోజు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. 

Source: Eenadu

కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇండోర్‌లో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సైకిల్‌ తొక్కి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

Source: Eenadu

తిరుచానూరు పద్మావతి ఆలయంలో పంచమితీర్థం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు.

Source: Eenadu

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ‘హను-మాన్‌’ సినిమా హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్‌వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘హను-మాన్’ టీజర్‌ బాగుందని కిషన్‌రెడ్డి వారికి కితాబిచ్చారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home