చిత్రం చెప్పే విశేషాలు!

(02-12-2022/2)

నెల్లూరులో ఓ నూతన హోటల్‌ ప్రారంభోత్సవంలో సినీతార కృతిశెట్టి పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Source: Eenadu

అడివి శేష్‌ కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 2’ ఇవాళ విడుదలైంది. పబ్లిక్‌ టాక్‌ తెలుసుకొనేందుకు అడివి శేష్‌, మీనాక్షి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్దకు వెళ్లి సందడి చేశారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెరాస మహిళా నేతలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు.

Source: Eenadu

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు గ్రామానికి చెందిన భాగ్య.. పుట్టుకతోనే దివ్యాంగురాలు. అయితేనేం.. తెలుగు యూనివర్సిటీలోని జానపద కళల శాఖలో చేరి పీజీ చేస్తోంది. పట్టుదలతో నృత్యం నేర్చుకొని యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో ఇలా ప్రదర్శన ఇచ్చింది.

Source: Eenadu

సోమాజీగూడలోని విల్లా మేరీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ‘ది విల్లా కాన్‌క్లేవ్ 2022’ పేరిట పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినులు నాటకాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. టేబుల్ టెన్నిస్, చెస్‌ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Source: Eenadu

కడప జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌లో బోటింగ్‌ జెట్టీలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బోటులో విహరించి పరిసర అందాలను తిలకించారు.

Source: Eenadu

తమిళనాడుకు చెందిన ‘లెటర్‌ డ్రాయింగ్‌’ కళాకారుడు గణేశ్‌ సుందర్‌.. మంత్రి కేటీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తెలుగు అక్షరాలతో మంత్రి కేటీఆర్‌ చిత్రాన్ని తీర్చిదిద్ది ట్విటర్‌లో పోస్టు చేశారు. 

Source: Eenadu

ముంబయిలో నిర్వహించిన ‘సర్కస్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నటీనటులు రణ్‌వీర్‌సింగ్‌, పూజాహెగ్డే పాల్గొని నృత్యం చేస్తూ సందడి చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(03-02-2023/2)

Eenadu.net Home