చిత్రం చెప్పే విశేషాలు!

(04-12-2022/2)

హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో ఓ నూతన బేకరీని సినీ నటి రాశీసింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

‘అవతార్‌2’ కథానాయిక జోయా సాల్డానా లండన్‌లో నిర్వహించిన సినిమా ప్రమోషన్స్‌లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ‘అవతార్‌2’ ఈ నెల 16న థియేటర్లలో విడుదల కానుంది.

Source: Eenadu

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

Source: Eenadu

ఇండోనేసియాలోని లుమజాంగ్‌లో మౌంట్‌ సెమెరు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో దాని నుంచి పెద్దఎత్తున పొగ, వాయువులు, దుమ్ము, లావా వెలువడుతోంది.

Source: Eenadu

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నిర్వహించిన బీఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకల్లో సైనికులు ద్విచక్రవాహనాలపై అదరగొట్టే విన్యాసాలు చేశారు.

Source: Eenadu

స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్‌ రికార్డులకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా... అదే పేరుతో రవితేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రముఖ నటి రేణు దేశాయ్‌ నటిస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సెట్లో కేక్‌ కట్‌ చేశారు.

Source: Eenadu

బాలకృష్ణ- గోపీచంద్‌ మలినేని కాంబోలో వస్తోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయినట్లు ప్రకటిస్తూ ఈ ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Eenadu 

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్‌ను డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ విడుదల చేసింది. దీనికి సుజిత్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ దీనిని షేర్‌ చేస్తూ తెగ ఆనందపడుతున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (02-10-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు (02-10-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(01-10-2023/2)

Eenadu.net Home