చిత్రం చెప్పే విశేషాలు!

(05-12-2022/2)

నాంపల్లి మెట్రో స్టేషన్‌ వద్ద పావురాలు గుంపులుగుంపులుగా ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. పలువురు సందర్శకులు తమ చిన్నారులతో వచ్చి వాటికి ఆహారంగా ధాన్యపు గింజలు వేస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.

Source: Eenadu

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బాసర ‘వేద భారతి పీఠ’ వేద విద్యాలయాన్ని సందర్శించారు. భాజపా అధికారంలోకి వస్తే వేద పాఠశాలల సంఖ్య మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.

Source: Eenadu

విశ్వక్‌సేన్‌ హీరోగా ‘హిట్‌’, అడివి శేష్‌ కథానాయకుడిగా ‘హిట్‌ 2’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ‘హిట్‌ 3’ నాని హీరోగా తెరకెక్కిస్తామని చిత్రబృందం హింట్‌ ఇచ్చింది. దర్శకుడితో కలిసి ఈ ముగ్గురు హీరోలు ఒక చోట చేరిన ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

Source: Eenadu

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్‌ బెలూగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం సోమవారం సాయంత్రం 7.20గంటల వరకు ఇక్కడ ఉండనుంది.

Source: Eenadu

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. వడోదరలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Source: Eenadu

లండన్‌లోని కింగ్‌ క్రాస్‌ స్టేషన్‌ వద్ద ‘హోమ్‌లెస్‌ ఛారిటీ క్రైసిస్‌’ సంస్థ 4.3 మీటర్ల ఎత్తైన నిరాశ్రయుడి విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఫేస్‌మ్యాపింగ్‌ టెక్నాలజీ సహాయంతో సహజత్వం ఉట్టిపడేలా దీన్ని తీర్చిదిద్దారు.

Source: Eenadu

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

Source: Eenadu

అంతర్జాతీయ మట్టి దినోత్సవం సందర్భంగా ‘మట్టిని రక్షించు(సేవ్‌ సాయిల్‌)’ వాలంటీర్లు హైదరాబాద్‌లోని చార్మినార్, ఉస్మానియా క్యాంపస్‌, శిల్పారామం, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో మట్టి క్షీణతపై అవగాహన కల్పించారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home