చిత్రం చెప్పే విశేషాలు..!
(06-12-2022/2)
గత రెండు సంవత్సరాలుగా గండికోట ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉండటంతో వలస పక్షులు ఇక్కడకు వస్తున్నాయి. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు పొలాల వద్ద తల మీద నుంచి ముక్కు వరకు నల్లగా ఉండే ఈ (బ్లాక్ హెడ్ ఐబిస్) కొంగలు సందడి చేస్తున్నాయి.
Source: Eenadu
మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. దీంతో పాశ్చాత్య దేశాల్లో సందడి మొదలైంది. జర్మనీలోని కుహార్ట్‌లో కొందరు ఔత్సాహికులు శాంటాక్లాజ్‌ల వేషధారణలో ఖరీదైన బైక్‌లపై ర్యాలీ చేస్తూ దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ యాత్ర చేపట్టారు.
Source: Eenadu
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన నేపథ్యంలో రెండో వన్డే కోసం భారత ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Source: Eenadu
గత కొన్ని రోజులుగా ఇండోనేసియాలోని మౌంట్ సెమేరు బూడిద, ఇతర వ్యర్థాలు వెదజల్లుతోంది. దాంతో ఆ అగ్నిపర్వతానికి సమీపంలోని ఓ ఇల్లు ఇలా బూడిదలో కూరుకుపోయింది.
Source: Eenadu
రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్ ఓం బిర్లా తదితరులు.
Source: Eenadu
తమ కుమార్తె శ్వేత వివాహానికి హాజరు కావాల్సిందిగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని దంపతులు.
Source: Eenadu
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సనత్‌నగర్ నియోజకవర్గంలోని పద్మారావునగర్, హమాలీబస్తీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఆయన ముందుకు సాగారు.
Source: Eenadu
ఈ చిత్రంలో కన్పిస్తున్నవి పెద్ద బాతులు. టిబెట్, మధ్య ఆసియా దేశాల నుంచి ఇవి చలికాలంలో భారతదేశానికి వలస వస్తుంటాయి. భారత్-పాక్ సరిహద్దులోని ఘరానా గ్రామం వద్ద ఇలా ఆహార వేట సాగిస్తూ సందడి చేస్తున్నాయి.
Source: Eenadu