చిత్రం చెప్పే విశేషాలు!

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ భద్రాచలం చేరుకున్నారు. గోదారమ్మకు శాంతిపూజ నిర్వహించారు. ఆ తర్వాత పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో సీఎం మాట్లాడారు.

Source: Eenadu

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటించారు. అశ్వాపురం మండలం బట్టీల గుంపు వద్ద బాధితులతో ఆమె మాట్లాడారు.

Source: Eenadu

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఆలయం వద్దకు తరలివస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Source: Eenadu

వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ రాసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు వివిధ పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. విజయవాడలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద సందడిని చిత్రాల్లో చూడవచ్చు.

Source: Eenadu

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీరంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్ద జీయర్‌స్వామి మఠంలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలోకి తీసుకెళ్లారు.

Source: Eenadu

తెలుగు తేజం పీవీ సింధు తన కెరీర్‌లోనే తొలి సూపర్ 500 టైటిల్‌ను నెగ్గింది. సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్‌ జి యిని మట్టికరిపించింది. ప్రస్తుత సీజన్‌లో సింధుకిది మూడో టైటిల్‌.

Source: Eenadu

ఫొటోలో కనిపిస్తున్న లిజా అనే నాలుగేళ్ల బాలికకు అప్పుడే నూరేళ్లు నిండాయి. ఉక్రెయిన్‌లోని వినిట్సియాలో గురువారం జరిగిన రష్యన్‌ మిసైల్‌ దాడిలో ఆమెతో పాటు మరో 22మంది మృతి చెందారు. ఇందులో ఏడు నుంచి 8ఏళ్ల వయసున్న బాలురు ఇద్దరున్నారు.

Source: Eenadu

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి.. వరద బాధితులకు భరోసా ఇచ్చారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హైలైఫ్‌ బ్రైడ్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రివ్యూ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

అమలాపాల్‌ సీమంతం..

ఇంత అందంగా ఉంటే ఎలా మేడమ్‌..

కల్పనా సోరెన్‌ గురించి తెలుసా?

Eenadu.net Home