చిత్రం చెప్పే విశేషాలు..!

(19-07-2022/1)

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌ పంచాయతీ పరిధి మామిడిగూడ(జి)కు చెందిన ఓ గర్భిణి గాంధారి వాగు దగ్గరే ప్రసవించింది.

Source: Eenadu

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ అశ్వాపురంపాడుకు చెందిన గర్భిణి పోడియ దేవికి సోమవారం పురిటి నొప్పులొచ్చాయి. మరో మార్గం లేక కుటుంబ సభ్యులు ఓ కర్రకు కుర్చీని కట్టి, అందులో గర్భిణిని కూర్చోబెట్టి రెండు మైళ్ల దూరంలోని ఆస్పత్రికి మోసుకెళ్లారు.

Source: Eenadu

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని ఈ జలపాతం చూపరులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ 50 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు జాలువారుతున్నాయి.

Source: Eenadu

వర్షాలతో భూగర్భ జలమట్టం పెరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మేడిగూడలో రైతు విజయ్‌కుమార్‌కు చెందిన పొలంలోని బోరుబావి నుంచి వాటంతట అవే నీళ్లు ఇలా ఉబికొస్తున్నాయి.

Source: Eenadu

కశ్మీర్‌ అందాల్ని తలపిస్తూ ఆకు పచ్చని వర్ణంతో కనువిందు చేస్తున్న ఈ ప్రాంతం ములుగు జిల్లా వెంకటాపూర్‌లో చూడొచ్చు. ఎటు చూసినా కొండలు, గుట్టలు వర్ణ శోభితమే.

Source: Eenadu

ములుగు జిల్లాలో సాగు పనులు ఊపందుకున్నాయి. పొలం దమ్ము చేయడం కేజ్‌ వీల్స్‌ ట్రాక్టర్‌ను టైర్లతో ఉన్న మరో ట్రాక్టర్‌ హైడ్రాలిక్‌ పట్టీలపైకి అనుసంధానం చేసి ఇలా తీసుకెళ్లారు.

Source: Eenadu

వాజేడు మండల కేంద్రంలోని నాగారంలో వరదలకు ఎనిమిది ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. నివాసం ఉండేందుకు వసతి లేకపోవడంతో గృహాల సమీపంలో రహదారిపైనే పాక ఏర్పాటు చేసుకున్నారు.

Source: Eenadu

యాదగిరిగుట్టలో వర్షంతో యాదాద్రి క్షేత్రం, పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు కనువిందు చేశాయి. కొండలను తాకుతున్నట్లు మేఘాలు, కృష్ణశిలపై నుంచి జాలువేరే వర్షం చూపరులను ఆకట్టుకుంది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (24-04-2024/1)

బెంగళూరులో వర్షాలు.. ప్రణీత సంబరాలు

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

Eenadu.net Home