చిత్రం చెప్పే విశేషాలు!

(19-07-2022/2)

ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ తెరాస ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమవుతోందని తెలుపుతూ నినాదాలు చేశారు.

Source: Eenadu

అమలాపురం మండలం సాకుర్రులో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో సచివాలయంలోకి వరద నీరు చేరడంతో అందులోనే ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ కనిపించారు.

Source: Eenadu

ఇటీవల రాజ్యసభకు నామినేట్‌ అయిన మాజీ అథ్లెట్‌, ఎంపీ పీటీ ఉష మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Source: Eenadu

అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ప్రభుత్వ పథకాల ఫలాలను అందుకోని లబ్ధిదారుల ఖాతాల్లోకి మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నగదు బదిలీ చేశారు.

Source: Eenadu

విపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్‌ ఆల్వా మంగళవారం పార్లమెంటులో నామినేషన్‌ వేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

Source: Eenadu

పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 569 కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన 1,23,984 మద్యం సీసాల విలువ సుమారు రూ.1.74కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Source: Eenadu

ప్రముఖ సినీ నటుడు మహేశ్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.

Source: Eenadu

తెలంగాణకు చెందిన రామ్‌ప్రసాద్‌ భండారి, ఆయన కుమార్తె ఇటీవల తనను కలిశారని సినీ నటుడు సోనూసూద్ తెలిపారు. గతంలో తన సాయంతో రామ్‌ప్రసాద్‌ అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు తెలిపారు.

Source: Eenadu 

ఏపీలో నివసిస్తున్న తూర్పు కాపులందరినీ ఓబీసీలో చేర్చాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు వినతి పత్రం సమర్పించారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home