చిత్రం చెప్పే విశేషాలు..!
(07-08-2022/1)
కాకినాడలో వందేమాతర నినాదం మార్మోగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 600 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ర్యాలీ తీశారు.
Source: Eenadu
అయినవారిని కోల్పోయి కన్నీటి పర్యంతమయ్యే కుటుంబీకులు.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు పెద్ద సాహసమే చేస్తున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం రాయచోటి గ్రామంలో శ్మశాన వాటికకు చేరుకోవాలంటే తుంగభద్ర నదిలోంచి వెళ్లాల్సి వస్తోంది.
Source: Eenadu
చిత్రంలో కనిపిస్తోంది కడప-చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని చెన్నూరు సమీపంలోని హజ్‌హౌస్ భవనం. ముస్లిం సోదరుల కోసం గత ప్రభుత్వం రూ.27 కోట్లతో నిర్మించింది. ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ముళ్లచెట్లతో భవనం ప్రాంగణం కళాహీనంగా దర్శనమిస్తోంది.
Source: Eenadu
స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా దిల్లీలో శనివారం నిర్వహించిన తిరంగ ర్యాలీలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న భాజపా శ్రేణులు.
Source: Eenadu
కుప్పం పట్టణంలోని రోడ్లలపై కొందరు యువకులు తమ ద్విచక్రవాహన ముందు చక్రాన్ని గాల్లోకి లేపి నడుపుతున్నారు. ఈ సమయంలో చిన్న పొరపాటు జరిగినా ఎదురుగా వచ్చే అమాయక ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
Source: Eenadu
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజును మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు. రాత్రి సమయంలో వాహనాల రాకపోకల నడుమ బురుజు అందాలు కనువిందు చేస్తున్నాయి.
Source: Eenadu
అవనిగడ్డ మండలం చల్లపల్లి రైతు బజారులో శనివారం పెండలం దుంప ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు అడుగులకుపైగా పొడవు పెరిగింది. 5.45 కిలోల బరువుంది.
Source: Eenadu
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద కోతకు గురైన సముద్రతీరం ఇది. పదేళ్ల క్రితం 200 మీటర్ల లోపల ఉండే సముద్రం.. ఇప్పుడు ముందుకు దూసుకు రావడంతో తీరంలో ఉన్న కొన్ని ఇళ్లు, హేచరీలు, కట్టడాలు సముద్రంలో కలిసిపోయాయి.
Source: Eenadu