చిత్రం చెప్పే విశేషాలు..!

(21-12-2022/2)

 క్రిస్మస్‌ సమీపిస్తున్న నేపథ్యంలో మెగా వారసులు ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన, వరుణ్‌ తేజ్‌, అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహ, శిరీష్‌, సాయితేజ్‌, వైష్ణవ్, సుష్మిత, నిహారిక తదితరులు ఇందులో పాల్గొన్నారు.

Source: Eenadu

ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీనటి రోజా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమె వెంట జబర్దస్త్‌ కమెడియన్లు ఆది, రాంప్రసాద్‌ ఉన్నారు.

Source: Eenadu

‘హరిహర వీరమల్లు’ చిత్రంలోని ప్రధాన పోరాట సన్నివేశాల చిత్రీకరణ మంగళవారం పూర్తయినట్లు ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ తెలిపారు. కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ తనను ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెబుతూ ఈ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు.

Source: Eenadu

యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా ‘కేజీఎఫ్‌-ఛాప్టర్‌ 1’. ఈ సినిమా విడుదలై నేటికి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేసింది. 

Source: Eenadu

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో కేకు కోసి జన్మదిన వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు విడదల రజనీ, రోజా, తానేటి వనిత, జోగి రమేశ్‌, సీఎస్‌ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Source: Eenadu

బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు గురువారం నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ కోసం ప్రాక్టీసు చేస్తున్నారు. విరామ సమయంలో విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ కొబ్బరి బొండం తాగి సేదతీరారు.

Source: Eenadu

దిల్లీలోని వ్యాపారులు చైనా దుస్తుల దిగుమతిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆ దేశంలో తయారైన దుస్తులను దహనం చేశారు. చైనా వస్తువుల వల్ల దేశంలోని తయారీదారులు ఆర్థికంగా దెబ్బతింటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Source: Eenadu

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రంగమార్తాండ’. ఇటీవల ఈ సినిమా కోసం ప్రముఖ నటుడు చిరంజీవి ఓ షాయరీ పాడారు. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ.. చిరంజీవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home