చిత్రం చెప్పే విశేషాలు..!

(26-12-2022/1)

మంథని మండలం నాగారం.. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. ఇక్కడ రూ.2.16 లక్షలతో అత్యాధునిక నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. సౌరశక్తి ద్వారా పని చేసే వీటితో నేరాలు తగ్గుముఖం పట్టనున్నాయని సర్పంచి మల్లేష్‌ తెలిపారు. 

source : eenadu

పెద్దపల్లి పట్టణంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. కోతుల కిష్కిందకాండను తప్పించుకోవడానికి పట్టణానికి చెందిన ఓ రైల్వే ఉద్యోగి ఇంటిపై ఉండే డీటీహెచ్‌ యాంటినా చుట్టూ ఇనుప చువ్వల జాలీని అమర్చుకున్నాడు.

source : eenadu

నల్గొండలో ఏర్పాటు చేసిన పిడికిలితో కూడిన అరచేతి ఆకృతి ఆకట్టుకుంటోంది. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్, చిప్‌లు, ఐసీలు, రెసిస్టర్లు, కండెన్సర్లు, తదితర వస్తువుల రూపాలతో ఈ ఆకృతి రూపొందించారు. 

source : eenadu

మనుషులకే కాదు.. శిల్పాలకూ ‘శస్త్రచికిత్స’ చేస్తున్నారు. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల గుడి ముందున్న నంది విగ్రహానికి ధ్వంసమైన ఎడమ కాలు, ఎడమ చెవి ఇతర భాగాలను పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌) పదార్థంతో తయారుచేసి విగ్రహానికి అతికించారు.

source : eenadu

శివలింగాన్ని ఓ తాబేలు హత్తుకున్న ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. జునాగఢ్‌ జిల్లాలోని భావ్‌నాథ్‌ ఆలయంలోని శివలింగం వద్దకు ఓ తాబేలు వెళ్లింది. అనంతరం శివలింగాన్ని హత్తుకుంది. ఈ దృశ్యాలను ఓ భక్తుడు మొబైల్‌లో బంధించాడు. 

source : eenadu

పచ్చని పైరు.. ఆపై విరగ బూసిన పూతతో కళకళలాడుతూ కనువిందు చేస్తున్న ఈ తోటను పత్తికొండ మండల పరిధి దూదేకొండ సమీపంలోని పొలంలో సాగు చేశారు. చిక్కుడు తోట ఇలా నిండా పూతతో అటువెళ్లే చూపరులను కట్టిపడేస్తున్న దృశ్యం కెమెరా కంటికి చిక్కింది.

source : eenadu

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. క్యూలైన్లు నిండిపోయాయి. దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించారు.

source : eenadu

క్రిస్మస్‌ సెలవులు, ఆదివారం కావడంతో సాగరతీరం పర్యాటకులతో సందడిగా మారింది. కురుసుర జలాంతర్గామి మ్యూజియం, టియు 142 యుద్ధ విమాన మ్యూజియం వద్ద సందర్శకులు బారులు తీరారు. ఆర్కే బీచ్‌లో అలలపై ఆడిపాడారు.

source : eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home