చిత్రం చెప్పే విశేషాలు!

(27-12-2022)

గత మూడ్రోజులుగా ఉత్తరాదిని చలి వణికిస్తోంది. దీంతో దిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో పొగమంచు దట్టంగా అలముకుంది. సోమవారం అత్యల్పంగా 5 డిగ్రీలు, అత్యధికంగా 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దిల్లీ, జమ్మూలో తీసిన చిత్రాలివి.

Source: Eenadu

ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాకలోని ఆవాస కేంద్రంలో సైబీరియన్‌ వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఓ తల్లి పక్షి ఆహారం సేకరించుకొని వచ్చి ఆకలితో ఎదురు చూస్తున్న తన పిల్లలకు తినిపిస్తున్న దృశ్యమిది.

Source: Eenadu

న్యూయార్క్‌ పర్యటనను ఆస్వాదిస్తూ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఫొటోలకు పోజిస్తున్న ఎన్టీఆర్‌.

Source: Eenadu

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ వద్దనున్న ఆల్లెఘ్నై నది అతి శీతల వాతావరణ ప్రభావంతో గడ్డ కట్టింది. దాని ఒడ్డున నిలిపి ఉంచిన బోటు తాజా పరిస్థితి ఇది.

Source: Eenadu

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇద్దరు ఉద్యోగులు విశాఖ నుంచి తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 12న ప్రారంభమైన వీరి యాత్ర తాడేపల్లి చేరిన నేపథ్యంలో తీసిన చిత్రమిది.

Source: Eenadu

అమెరికాలో ‘బాంబ్‌ సైక్లోన్‌’ బీభత్సం కొనసాగుతోంది. చాలా రాష్ట్రాల్లో మంచు కొన్ని అడుగుల మేర పేరుకుపోయింది. బఫెలో ప్రాంతం ఈ తుపానుకు తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడ తీసిన చిత్రాలివి.

Source: Eenadu

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి లూజన్‌ పట్టణంలోని ప్రసిద్ధ హోటల్‌ మాండరిన్‌ ఓరియంటల్‌ ప్యాలస్‌లో ఆయన బస చేశారు. ఆ ఆతిథ్యం తనకెంతో నచ్చిందంటూ ఫ్యామిలీ ఫొటోతో ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.

Source: Eenadu

హైదరాబాద్‌ బస్ భవన్‌లో ‘సింగరేణి దర్శన్‌’ బస్సులను ప్రారంభించారు. వెలుగులు నింపే సింగరేణి బొగ్గు గనులు ఎలా ఉంటాయి. భూగర్భంలో ఉన్న బొగ్గును ఎలా బయటకు తీస్తారో పర్యాటకులు ఈ బస్సు యాత్ర ద్వారా తెలుసుకోవచ్చు. టికెట్‌ ధర రూ. 1600.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home