చిత్రం చెప్పే విశేషాలు!

(29-12-2022/2)

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత వేద పండితులు ఆయనకు ఇస్తీకఫాల్‌ స్వాగతం పలికారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

Source: Eenadu

సుహాస్‌ హీరోగా షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. ‘అమ్మ చెప్పని చందమామ కథ!’ ఇదంటూ సుహాస్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పోట్టారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న విడుదల చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.

Source: Eenadu

చిరంజీవి హీరోగా కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో చిరంజీవి, రవితేజలపై చిత్రీకరించిన పాటను శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో ఇద్దరు నటుల ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Source: Eenadu

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం స్వామివారు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Source: Eenadu

రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన తెగల ప్రజలతో సమావేశమై వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మోడల్స్‌ నూతన డిజైన్ల ఆభరణాలు, దుస్తులు ధరించి తళుక్కుమన్నారు.

Source: Eenadu

కేరళ సీఎం పినరయి విజయన్‌ ఖమ్మంలో పర్యటించి అక్కడ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆయనకు స్వాగతం పలికారు. 

Source: Eenadu

తన వియ్యంకుడు(మంత్రి కేటీఆర్‌కు మామ) పాకాల హరినాథరావు మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. హరినాథరావు భౌతికకాయానికి నివాళి అర్పించారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home