చిత్రం చెప్పే విశేషాలు..!
(03-01-2023/2)
ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రూక్ పట్టణంలో 71వ ఫోర్ హిల్స్ స్కై జంపింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అందులో పాల్గొన్న నార్వేకు చెందిన డానియెల్ ఆండ్రూ టాండే జంప్ చేస్తుండగా తీసిన చిత్రమిది.
Source: Eenadu
నల్గొండ జిల్లా మనుగోడు నియోజకవర్గం మర్రిగూడలో 30 పడకల సీహెచ్‌సీ ఆస్పత్రిని మంత్రులు హరీశ్‌రావు.. జగదీశ్‌రెడ్డి స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు అక్కడి వైద్య సిబ్బందితో కలిసి ఇలా సెల్ఫీ దిగారు.
Source: Eenadu
హైదరాబాద్‌లో రాష్ట్రపతి శీతాకాల విడిది పూర్తయిన నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శనకు సామాన్యులను అనుమతిస్తున్నారు. వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న చిత్రమిది.
Source: Eenadu
ఈ చిత్రంలో కన్పిస్తున్న వ్యక్తి పేరు గంగయ్య. పుట్టుకతోనే అంధుడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన ఈయన తన పనులు తానే చక్కబెట్టుకుంటాడు. అంతే కాదు.. కట్టెలు కొడుతూ.. తాళ్లు అల్లుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు.
Source: Eenadu
నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయిన నేపథ్యంలో కథానాయకుడు నాని సినిమా సెట్‌కు తన అభిమానులను ఆహ్వానించారు. వారితో ఫొటోలు దిగారు.
Source: Eenadu
ఈ నెల 5న సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ జయంతి. ఈ నేపథ్యంలో జమ్మూలో నిర్వహించనున్న యుద్ధవిద్య ప్రదర్శన కోసం కొందరు యువకులు ఇలా సన్నద్ధమవుతూ కనిపించారు.
Source: Eenadu
వాతావరణ మార్పులతో ప్రకృతిలో ఎన్నో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కెనడాలోని అగాసిజ్-ఛిల్లీవ్యాక్ పట్టణాల మధ్యలోని ఫ్రేజర్ నదీ తీర ప్రాంతంలో ఇలా మంచు ఫలకలు ఏర్పడ్డాయి.
Source: Eenadu
భాగ్యనగరంలో ప్రతి ఒక్కరిదీ ఉరుకు పరుగుల జీవితం. రోడ్డెక్కితే ఎక్కడికైనా త్వరగా చేరుకోవాలన్న ఆతృతే తప్ప పాదచారుల గురించి కాస్తయినా ఆలోచన వాహనదారులకు ఉండటం లేదు. పంజాగుట్ట వద్ద ఓ మహిళ దివ్యాంగుడైన తన భర్తను రోడ్డు దాటించేందుకు ఇలా ఆపసోపాలు పడాల్సి వచ్చింది.
Source: Eenadu