చిత్రం చెప్పే విశేషాలు!
(10-01-2023/2)
ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో 40 ఇంటర్నెట్ సాటిలైట్స్‌ను మోసుకెళ్లింది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో తెతెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్వర్యంలో దశ మహా విద్యా పూర్వక నవ చండీ యాగ మహోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు హాజరై వేద పండితుల నుంచి ఆశీర్వచనం పొందారు.
Source: Eenadu
జపాన్ రాజధాని టోక్యోలోని కోటోహిరగు మందిరం వద్ద కొన్‌పిరా ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొందరు ఔత్సాహికులు ఒకమే అనే సంప్రదాయ మాస్కు ధరించి సందడి చేశారు.
Source: Eenadu
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు. ‘ఆ రోజులన్నీ సంతోషకరమైనవి. మా మాధ్య ఎలాంటి విభేదాలు ఉండేవి కావు.(1945లో నా సోదరుడు జిమ్మీ)’ అంటూ రాసుకొచ్చారు.
Source: Eenadu
అమెరికాలోని కాలిఫోర్నియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల నివాసాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Source: Eenadu
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు హస్తినమడుగులో మెస్రం వంశీయులు గంగాజలం సేకరించారు. ఈ నెల 21న కేస్లాపూర్‌లోని ఆదివాసీల ఆరాధ్య దేవుడు నాగోబా అభిషేకానికి అవసరమయ్యే పవిత్ర గోదావరి జలాన్ని తీసుకెళ్లారు.
Source: Eenadu
బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్.. చిత్రబృందంతో స్టూడియోలోని సౌండ్ సిస్టమ్ దగ్గర దిగిన ఫొటోను పోస్టు చేశారు.
Source: Eenadu
కరీనగర్‌లోని సిద్దార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.. విద్యార్థులు హరిదాసుల వేషధారణలో అలరించారు.
Source: Eenadu