చిత్రం చెప్పే విశేషాలు!

(11-01-2023/2)

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని నెల్లూరులోని ఆయన నివాసంలో మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.

Source: Eenadu

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్’ను వరించింది. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట ఈ అవార్డును సొంతం చేసుకొంది. దీంతో చితృ బృందం, భారతీయ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Source: Eenadu

సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితోపాటు సిద్ధు జొన్నలగడ్డ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్, డ్యాన్స్‌ మాస్టర్ శేఖర్ తదితరులు పాల్గొని విద్యార్థుల్లో జోష్‌ పెంచారు.

Source: Eenadu

తెలంగాణ నూతన సీఎస్‌ శాంతి కుమారి సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు సీఎస్‌గా అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ నూతన పిజ్జా దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి మధుశాలిని పాల్గొని వివిధ రకాల పిజ్జాలను రుచిచూశారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో సూత్ర ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలితీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంకాల వేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. పొగమంచు కారణంగా రాకపోకలకు సైతం వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

Source: Eenadu

విరాట్‌ కోహ్లీ, అనుష్కశర్మ దంపతులు తమ కుమార్తె వామిక రెండో పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టా ఖాతాల్లో ఫొటోలు పంచుకున్నారు. విరాట్‌ కోహ్లీ ‘నా హృదయ స్పందనకు రెండేళ్లు’ అని పోస్టు పెట్టారు.

Source: Eenadu

ఆసియా జ్యువెల్లర్స్‌ ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 25న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను బంజారాహిల్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటి అనన్య నాగళ్ల పాల్గొని నూతన ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home