చిత్రం చెప్పే విశేషాలు!
(15-01-2023/1)
బూడిద, నలుపు రంగులు మిళితమైన శరీరం, ఎర్రటి కళ్లతో కనిపిస్తున్న ఈ పక్షిని తెలుగులో ‘అడవి రామదాసు’ అని పిలుస్తారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఈ నల్ల రెక్కల గద్ద కనిపించింది.
source : eenadu
సంక్రాంతిని పురస్కరించుకుని ఏటికొప్పాక చెందిన హస్తకళాకారిణి చింతల లావణ్య అరచేతిలో ఇమిడిపోయే సైజులో డూడూ బసవన్న లక్కబొమ్మను తయారు చేశారు. వినూత్నంగా తయారు చేసిన ఈ బొమ్మ అందరినీ ఆకట్టుకుంటోంది.
source : eenadu
వేడుక ఏదైనా బహుమతిగా ఓ మొక్కను అందించడం ఇటీవల పరిపాటిగా మారింది. దీంతో నర్సరీ రైతులు అలాంటి వారి అభిరుచులకు అనుగుణంగా మొక్కలు పెంచి విక్రయిస్తున్నారు. కడియపులంకలోని శ్రీసత్యదేవా నర్సరీలో టెస్ట్‌ట్యూబ్‌లలో ఇలా మనీప్లాంట్, లక్కీబ్యాంబూ వంటి మొక్కలు పెంచుతున్నారు.
source : eenadu
శనివారం ఉదయం నగరంలో పొగ మంచు దట్టంగా కురిసింది. ఉదయం తొమ్మిది గంటల వరకూ ఇదే పరిస్థితి. రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో పొగ మంచు ప్రభావం మరింతగా కనిపించింది.
source : eenadu
బల్గేరియాలోని కోషరెవో గ్రామంలో శీతాకాల ఉత్సవంలో భాగంగా పక్షి ఈకలతో తయారు చేసిన కవచం ధరించి వస్తున్న స్థానికుడు.
source : eenadu
సాధారణంగా గాల్లో ఎగిరే పతంగులను చూస్తుంటాం.. కానీ ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయే గాలి పటాలు. సంక్రాంతి సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు హైదరాబాద్, ఉప్పల్‌లోని ఓ హోటల్‌లో పతంగులు, చరఖా ఆకారంలో కేక్‌లు తయారు చేసి ప్రదర్శించారు.
source : eenadu
పండగకు సొంతూళ్లకు వెళ్లే వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసి రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ అధికంగా ఉండటంతో చాలామంది కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణించాల్సి ఉండగా.. అనకాపలి నక్కపల్లిలో ఐదుగురు వెళ్తున్న దృశ్యమిది.
source : eenadu
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాంగర్‌బౌలితండాలో ‘పాత పంటల జాతర’ పేరిట చిరుధాన్యాల వేడుక జరిగింది.
source : eenadu