చిత్రం చెప్పే విశేషాలు!

(15-01-2023/2)

తెలుగు రాష్ట్రాల సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. 

Source: Eenadu

ప్రపంచంలోని అత్యంత మురికివాడల్లో ఒకటైన ముంబయి ధారావిలో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన మహిళలు పొంగల్‌ పండగను ఘనంగా నిర్వహించారు. రోడ్డుపైనే పొయ్యిలు ఏర్పాటు చేసి సంప్రదాయ వంటకాలు తయారు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Source: Eenadu

తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సంబరాల్లో పాల్గొని పొంగలి వండి అందరికీ వడ్డించారు.

Source: Eenadu

‘గోల్డెన్‌ గ్లోబ్‌’ పురస్కారం అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో అవార్డు వచ్చింది. బెస్ట్ మ్యూజిక్/స్కోర్‌ విభాగంలో లాస్‌ ఏంజిలెస్‌ ఫిల్మ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ నుంచి దక్కిన అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.

Source: Eenadu

ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కాకినాడ జిల్లాలో పర్యటించారు. సంక్రాంతి సందర్భంగా వలసపాకలలో ఏర్పాటు చేసిన బరి వద్ద కోడి పందేలను తిలకించారు.

Source: Eenadu

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల పోలీసులు ఇవాళ సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ వేషధారణలో కనిపించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజు, ఎస్సైలు చిరంజీవి, హుస్సేన్‌ తదితరులు స్థానిక దివ్యాంగుల కేంద్రంలో మిఠాయిలు పంపిణీ చేశారు.

Source: Eenadu

పీపుల్స్‌ప్లాజా వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అక్కడకు చేరుకొని భారాస పేరుతో రూపొందించిన గాలిపటాలను ఎగురవేశారు. పలువురు యువతులు గంగిరెద్దుల విన్యాసాలను చూస్తూ.. ఫొటోలు దిగారు.

Source: Eenadu

సంక్రాంతి పండగ సందర్భంగా నారా, నందమూరి కుటుంబాల సందడి కొనసాగుతోంది. ఇవాళ చంద్రగిరి మండలంలోని నాగాలమ్మ కట్ట వద్ద చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడు దేవాన్ష్‌తో చంద్రబాబు, బాలకృష్ణ సరదాగా ఆడుతూ కనిపించారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home