చిత్రం చెప్పే విశేషాలు!
(16-01-2023/1)
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో నిర్వహించే పశువుల పండగ(జల్లికట్టు)ను వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. దీంతో వీధులన్నీ ఇలా కిక్కిరిసిపోయాయి.
source : eenadu
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య పటేల్ పెద్ద కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్ వెళ్లిన సీఎం కేసీఆర్ మల్లయ్య పటేల్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం మంత్రిని పరామర్శించారు.
source : eenadu
హైదరాబాద్ నగరంలోని కోఠిలో పతంగుల పండగను ఉత్సాహంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా భవనాలపైకి ఎక్కి ఆనందంగా గాలిపటాలను ఎగురవేశారు.
source : eenadu
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లని ఉద్యోగుల కుటుంబాలు సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్ విహారానికి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా కనిపించింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి.
source : eenadu
తిరుమల తితిదే పరిపాలనా భవనం ప్రాంగణ మైదానంలో ఆదివారం రాత్రి కనులపండువగా గోదా కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు.
source : eenadu
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఉగాది వరకు కొనసాగనున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు.
source : eenadu
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి జాతర వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.
source : eenadu
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్నారు. దావోస్‌లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లి మంత్రి జురిచ్‌లోని ప్రవాసులతో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు.
source : eenadu
అఫ్గాన్‌లో షరియా చట్టం అమలు చేస్తూ అక్కడి మహిళలపై పలు ఆంక్షలను విధిస్తున్న పాలకులు తాజాగా బొమ్మలకు కూడా ముసుగులు వేయాలని హుకుం జారీ చేశారు. కాబుల్‌లోని ఓ దుస్తుల షాపులోని దృశ్యమిది.
source : eenadu