చిత్రం చెప్పే విశేషాలు!
(16-01-2023/2)
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో పశువుల పండగ(జల్లికట్టు)ను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పశువుల కొమ్ములకు వివిధ రంగులతో అలంకరణ చేసి ఫొటోలను అమర్చడం ఆకట్టుకుంటోంది.
Source: Eenadu
జర్మనీలోని నిడ్డేరౌ, ఐచెన్‌ల మధ్య ఉన్న రైలు మార్గంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. కాగా ఈ రైల్ రోడ్డు క్రాసింగ్ వద్ద వరదనీరు ప్రవహిస్తున్నా పై నుంచి రైలు వెళ్తున్న దృశ్యం ఆసక్తిని కలిగించింది.
Source: Eenadu
టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం ఉప్పల్‌లో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్ స్టేడియంలో టికెట్ల కోసం వచ్చిన అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది.
Source: Eenadu
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకుంది. ‘విడుదలైన నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ మేరకు చిత్రబృందం ట్వీట్ చేసింది.
Source: Eenadu
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ప్రభలతీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు.
Source: Eenadu
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ‘విడుదలైన మూడు రోజుల్లో రూ.108 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ మేరకు చిత్రబృందం ట్వీట్ చేసింది.
Source: Eenadu
పండగ వేళ పర్యాటక ప్రాంతమైన కాకినాడ సముద్రతీరం సందర్శకులతో కిక్కిరిసింది. విద్యార్థులకు సెలవులు కావడంతో ఇంటిళ్లిపాది తీరం వద్దకు చేరుకొని ఆటపాటలతో సందడి చేశారు. సందర్శకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో బీచ్ రోడ్డు నుంచి తీరం వరకు రహదారులు రద్దీగా మారాయి.
Source: Eenadu
కనుమ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. నిత్య కల్యాణంలో భాగంగా ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి నెలకొంది.
Source: Eenadu