చిత్రం చెప్పే విశేషాలు

(17-01-2023/1)

తెలంగాణ రాష్ట్ర సచివాలయ నూతన ప్రాంగణం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Source: Eenadu

బిహార్‌లోని దర్భంగా జిల్లాలో ఓ ఇనుప వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. కమ్లా నదిపై ఉన్న వంతెనపై ఓ లారీ లోడ్‌తో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా వంతెన రెండుగా చీలిపోగా లారీ మధ్యలోనే ఇరుక్కుపోయింది.

Source: Eenadu

కెనడాలోని క్యుబెక్‌ ప్రావిన్స్‌లో గడ్డకట్టిన సెయింట్‌ అన్నే నదిపై చేపలు పట్టేవారి కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక షెడ్లు ఇవి. సెయింట్‌ లారెన్స్‌కు ఉప నది అయిన అన్నే నదిలో టామ్‌కాడ్‌ చేపలు ఎక్కువగా లభిస్తాయి.

Source: Eenadu

హైదరాబాద్‌లో సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలను ఎగరవేయడానికి ఉపయోగించిన మాంజాకు చిక్కుకుని పలు చోట్ల పక్షులు చనిపోయాయి.

Source: Eenadu

కనుమ పండగ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలో గోవులకు అరటి పండ్లు తినిపిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Source: Eenadu

అనుకోకుండా చూస్తే ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని చూస్తున్నట్టు ఉంది కదూ.. నిర్మల్‌ నుంచి సారంగాపూర్‌ మండలంలోని సుప్రసిద్ధమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో ఓ పంట పొలంలో ఈ దృశ్యం కనిపించింది.

Source: Eenadu

విశాఖపట్నం నగరంలోని ఆర్‌.కె. బీచ్‌లో సోమవారం సాయంత్రం యువత, పిల్లలు, పెద్దలు రంగురంగుల గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. పోటాపోటీగా పతంగులు ఎగురవేసి ఉల్లాసంగా గడిపారు.

Source: Eenadu

కనుమ సందర్భంగా విజయవాడలోని భవానీ ఐలాండ్‌లో ఉత్సాహంగా పండగ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి రోజా కోలాటం ఆడి సందడి చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home