చిత్రం చెప్పే విశేషాలు!

(18-01-2023/2)

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌లతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.

Source: Eenadu

నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కస్టడీ’ సినిమాలో కృతి శెట్టి రేవతిగా కనిపించబోతోంది. దీనికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను కృతి శెట్టి తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

Source: Eenadu

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్‌ గార్డెన్‌లో ఆయనకు నివాళులు అర్పించారు.

Source: Eenadu

సందీప్‌కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌’. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఇందులో అనసూయ ‘చారులత’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

Source: Eenadu

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌ రసూల్‌పురలోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు బుధవారం అమరజ్యోతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సుహాసిని, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

Source: Eenadu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిని బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కలిశారు. ప్రపంచ వేదికపై ఆ సినిమాకు లభిస్తున్న ఆదరణకుగాను వారిని ఆమె అభినందిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరిన్ని అవార్డులు సాధించాలని ప్రియాంక ఆకాంక్షించారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచిన ఎనిమిదో నిజాం ముకర్రమ్‌జా బహదూర్‌ పార్థివ దేహానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.

Source: Eenadu

రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ దట్టమైన మంచుతో కప్పి ఉన్న రైల్వేస్టేషన్ ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. ఇది ఎక్కడ ఉందో కనుక్కోమంటూ ఫాలోవర్లకు ప్రశ్న వేశారు. ఇదో భూతల స్వర్గం అంటూ ఓ హింట్‌ కూడా ఇచ్చారు.

Source: Eenadu

భారత్‌, న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియంలో అభిమానుల సందడి.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(19-07-2025)

Eenadu.net Home