చిత్రం చెప్పే విశేషాలు!
(27-01-2023/2)
కాచిగూడలోని భద్రుకా కళాశాలలో ‘ఫ్లాష్ 2023’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినులు నృత్యం, ర్యాంప్ వాక్, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
Source: Eenadu
చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించడంతో ‘వీరయ్య విజయ విహారం’ పేరిట జనవరి 28న హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వేడుకను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చిత్రబృందం ప్రకటిచింది.
Source: Eenadu
కాలిఫోర్నియాలో నిర్వహించిన యూఎస్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పలువురు క్రీడాకారులు సాహసోపేత విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ‘పెటెక్స్ ఇండియా’ ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో 500రకాల శునకాలు, 120రకాల పిల్లుల్ని ప్రదర్శనకు ఉంచారు. వీటిని ముద్దు చేస్తూ సందర్శకులు సందడి చేశారు.
Source: Eenadu
అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 8వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘బీసీసీఐ వుమెన్’ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది.
Source: Eenadu
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శశివదనే’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. పూర్తి పాటను ఫిబ్రవరి 1న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ బాలోత్సవం’ నిర్వహించారు. కార్యక్రమానికి చిన్నారులు వివిధ వేషధారణల్లో హాజరై నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
Source: Eenadu
భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ప్రేయసి అతియాశెట్టిని ఇటీవల వివాహమాడిన సంగతి తెలిసిందే. తమ హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోను కేఎల్ రాహుల్ తన ట్విటర్ ఖాతాలో పంచకున్నారు.
Source: Eenadu