చిత్రం చెప్పే విశేషాలు!
(30-01-2023/2)
పవన్‌కల్యాణ్-సుజిత్ కాంబోలో తెరకెక్కనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్‌రాజు పాల్గొన్నారు.
Source: Eenadu
నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పై’. ఈ సినిమాలో తన లుక్‌కు సంబంధించిన ఫొటోను నిఖిల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. వేసవిలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పారు.
Source: Eenadu
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు.
Source: Eenadu
సెర్బియా క్రీడాకారుడు, ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్ తన ట్రోఫీతో ఆస్ట్రేలియాలోని ‘గవర్నమెంట్ హౌస్ గార్డెన్స్‌లో’ ఫొటోలకు పోజులిచ్చారు.
Source: Eenadu
జనసేన కార్యకర్త బాలాజీ పల్నాడు ప్రాంతంలో పల్లెపల్లెకు తిరుగుతూ ప్రజాసమస్యలపై అర్జీలు స్వీకరించారు. ‘పల్నాడు ప్రజా సమస్యల పెట్టె’ పేరిట ఈ కార్యక్రమరం చేపట్టారు. ఈ ఆలోచనకు మెచ్చిన పవన్‌కల్యాణ్ అతనికి ప్రోత్సాహక నగదు, మొబైల్ ఫోన్ బహూకరించారు.
Source: Eenadu
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు.
Source: Eenadu
టీ-హబ్ సహకారంతో పెట్ ఫోక్ సంస్థ ‘పెట్ ఫోక్ గ్రూమింగ్ వ్యాన్’ను ప్రారంభించింది. గ్రూమింగ్ వ్యాన్ ప్రారంభోత్సవంలో పలువురు మోడల్స్ పాల్గొని పెంపుడు జంతువులతో ఫొటోలు దిగారు.
Source: Eenadu
కశ్మీర్‌లో నేడు భారత్‌జోడో యాత్ర ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఒకరికొకరు శాలువాలు కప్పి సత్కరించుకున్నారు.
Source: Eenadu