చిత్రం చెప్పే విశేషాలు..!
(02-02-2023/2)
మహిళల అండర్19 క్రికెట్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులోని తెలంగాణ క్రీడాకారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు జి. త్రిష, యశశ్రీ, ఇతర సభ్యులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
Source: Eenadu
సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్, సందీప్ కిషన్ కలిసిన ఓ ఫొటోను చిత్రబృందం ట్వీట్ చేసింది.
Source: Eenadu
న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్‌లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘గో రెడ్ ఫర్ వుమెన్ రెడ్‌డ్రెస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మోడల్ జింజర్ గొంజగా ఎరుపురంగు దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.
Source: Eenadu
టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.
Source: Eenadu
సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మూడో టీ20లో న్యూజిలాండ్‌పై 168 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అనంతరం జట్టు సభ్యులంతా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఇలా పోజిచ్చారు.
Source: Eenadu
ప్రముఖ సినీనటుడు చిరంజీవి సీనియర్ కెమెరామెన్ దేవ్‌రాజ్‌కు రూ.5లక్షల ఆర్థిక సహాయం చేశారు. దేవ్‌రాజ్ గతంలో చిరంజీవి నటించిన టింగురంగడు, రాణికాసుల రంగమ్మ, నాగు, పులి బెబ్బులి సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశారు.
Source: Eenadu
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. కేసీఆర్ తన పాలన అద్భుతమని అంటున్నారని.. అదే నిజమైతే తమతో పాదయాత్రకు వచ్చి రుజువు చేయాలన్నారు. ఇందుకోసం బూట్లు కూడా పంపిస్తున్నామన్నారు.
Source: Eenadu
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటించిన చిత్రం ‘పాప్ కార్న్’. మురళి గంధం దర్శకత్వం వహించారు. పాప్‌కార్న్ చిత్రబృందం పర్యటనలో భాగంగా ఏలూరులోని అస్రం మెడికల్ కళాశాలలో విద్యార్థులతో కలిసి చిందులేసి సందడి చేశారు.
Source: Eenadu
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సెట్స్‌లో షూటింగ్ విరామ సమయంలో త్రివిక్రమ్ సరదాగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
Source: Eenadu