చిత్రం చెప్పే విశేషాలు..!
(06-02-2023/2)
తితిదే జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మంత్రి హరీశ్‌రావు బయలుదేరారు.
Source: Eenadu
లాస్ ఏంజెలెస్‌లో 65వ వార్షిక గ్రామీ అవార్డ్స్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ‘ఈజీ ఆన్ మీ’లో ప్రదర్శనకు గానూ అడెలె ఈ అవార్డును గెలుచుకున్నారు.
Source: Eenadu
సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని కుటుంబ సమేతంగా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Source: Eenadu
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.
Source: Eenadu
సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హీరో మహేశ్‌బాబు చిత్రబృందాన్ని ట్విటర్ వేదికగా అభినందించారు.
Source: Eenadu
హైదరాబాద్ సంజీవయ్య పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీ పనుల్లో పలువురు కూలీలు నిమగ్నమయ్యారు. వారి పిల్లల్లో ఓ చిన్నారి బాలిక పాఠశాలకు వెళ్లేముందు తన తమ్ముడి ఆకలి తీరుస్తూ కనిపించింది.
Source: Eenadu
సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆశాను అభినందించిన సీఎం.. ఆమె లక్ష్యం నెరవేరాలని రూ.10లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని సుచిత్రలో ఈ నెల 10న ఓ నగల దుకాణాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన ప్రీలాంచ్ ఈవెంట్‌లో పలువురు మోడల్స్ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేడారంలో అమ్మవార్లను దర్శించుకొని ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన బంగారం(బెల్లం)తో తులాభారం వేసుకున్నారు.
Source: Eenadu