చిత్రం చెప్పే విశేషాలు..!

(08-02-2023/2)

మాదాపూర్ హైటెక్స్‌లో ‘ఈ-మోటార్ షో’ పేరుతో ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రదర్శనను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ-బైక్‌ను నడిపి పనితీరును పరిశీలించారు.

Source: Eenadu

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీనటి శ్రీలీల మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆమె కొనియాడారు. శాన్వీ శ్రీవాస్తవ, అనుపమ పరమేశ్వరన్‌లను గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌కు శ్రీలీల నామినేట్‌ చేశారు.

Source: Eenadu

భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య గురువారం నుంచి బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలు దిగారు.

Source: Eenadu

గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌లో జీ20 ఆధ్వర్యంలో పర్యాటక సదస్సు నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. అక్కడి సంప్రదాయ వస్ర్తధారణలో ఒంటెను పట్టుకుని కనిపించారు.

Source: Eenadu

 ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్లాస్టిక్‌ సీసాలతో రీసైకిల్‌ చేసిన నీలం రంగు జాకెట్‌ ధరించి రాజ్యసభకు హాజరయ్యారు. బెంగళూరులో జరుగుతున్న ‘ఇండియన్‌ ఎనర్జీ వీక్‌ 2023’కు ఇటీవల హాజరైన మోదీకి.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఈ జాకెట్‌ను బహూకరించింది.

Source: Eenadu

చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్‌’. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో చిరంజీవి అదిరే స్టెప్పులతో ఓ పాట చిత్రీకరిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ట్విటర్‌లో పోస్టు పెట్టింది.

Source: Eenadu

హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో త్వరలో ప్రారంభం కానున్న నీరా కేఫ్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడ గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కుతున్నట్లుగా తీర్చిదిద్దిన అలంకరణలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Source: Eenadu

గతంలో క్వీన్‌ ఎలిజిబెత్‌-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ముద్రించిన 15కిలోల బంగారు నాణేన్ని లండన్‌లో నిర్వహించిన ‘ట్రయల్‌ ఆఫ్‌ ది పిక్స్‌’ కార్యక్రమంలో ప్రదర్శించారు.

Source: Eenadu

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home