చిత్రం చెప్పే విశేషాలు!
(10-02-2023/2)
టాలీవుడ్ అగ్ర హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతల పెళ్లి రోజు సందర్భంగా ఓ అరుదైన ఫొటోను ట్విటర్ వేదికగా మహేష్ బాబు నెటిజన్లతో పంచుకున్నారు. ‘18 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ బంధం ఇప్పటికీ.. ఎప్పటికీ ఇలాగే ఉంటుంది’ అంటూ క్యాప్షన్ జోడించారు.
Source: Eenadu
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థి రెండు చేతులు లేకపోవడంతో కాళ్లతో పరీక్ష రాశాడు. వెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన ఏలూరి శంకర్ అనే విద్యార్థి 10 ఏళ్ల క్రితం రెండు చేతులు కోల్పోయాడు.
Source: Eenadu
ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో శంకర్ దర్శకత్వంలో నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ఆర్‌సీ 15’ చిత్రం షూటింగ్ శుక్రవారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద జరిగింది.
Source: Eenadu
సమంత కీలక పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’ మరోసారి వాయిదా పడింది. ఈ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు చిత్రబృందం ప్రకటించింది. ఏప్రిల్ 14న సినీ అభిమానులను పలకరించేందుకు వస్తున్నట్లు తెలిపింది.
Source: Eenadu
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా శాసనసభ భవనంలోని ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులతో కలిసి కేకు కోసి వేడుక చేసుకున్నారు.
Source: Eenadu
యువగళం 15వరోజు పాదయాత్రలో భాగంగా రేణుకాపురం క్యాంపులో గంగాధర నెల్లూరు వ్యాపారులతో నారా లోకేశ్ మాట్లాడారు. జగన్ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక తామంతా బెంగళూరు వెళ్లిపోయామని వ్యాపారులు ఆయన ఎదుట వాపోయారు. లోకేశ్ వారికి ధైర్యం చెప్పారు.
Source: Eenadu
చెన్నైలో సినీనటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్జున్‌ను కలిసిన కవిత.. ఆయన ఆధ్యాత్మిక స్ఫూర్తి గొప్పదని కొనియాడారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని కొంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీ నటీమణులు నేహా శెట్టి, నిహారిక పాల్గొన్నారు. నూతన డిజైన్ల ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
Source: Eenadu
లఖ్‌నవూలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాన మంత్రి మోదీకి వినాయక విగ్రహాన్ని బహూకరించారు.
Source: Eenadu
కల్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్’. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో కల్యాణ్‌రామ్, ఆషికా ఇలా మెరిశారు.
Source: Eenadu