చిత్రం చెప్పే విశేషాలు..!

(16-02-2023/2)

సంతోష్‌ శోభన్‌, గౌరి జి.కిషన్‌ జంటగా నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించే ముందు గౌరి జి.కిషన్‌ ఫొటోలకు పోజులిచ్చారు.

Source: Eenadu

రవీంద్ర జడేజాతో కలిసి దిగిన ఈ ఫొటోను అక్షర్‌ పటేల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘మేము ఓ జోక్‌ వేసుకొని నవ్వుకున్నాం.. అది మా మధ్యే ఉంటుంది.. మీరూ ఆ జోక్‌ను ఊహించే ప్రయత్నం చేయండి’ అంటూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్లబండి తోలి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు.

Source: Eenadu

అమెరికన్‌ నటి టెస్సా థామ్సన్‌ లండన్‌లో నిర్వహించిన ‘క్రీడ్‌-3’ సినిమా ప్రీమియర్‌ కార్యక్రమంలో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

 బెంగళూరులోని యలహంకలో ‘ఏరో ఇండియా-2023’ కార్యక్రమం ఘనంగా సాగుతోంది. ఇందులో భాగంగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Source: Eenadu

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదినం శుక్రవారం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని అలియా బాలుర పాఠశాలలో విద్యార్థులందరూ కేసీఆర్‌ ఫేస్ మాస్క్‌లు ధరించి సంబరాలు చేసుకున్నారు.

Source: Eenadu

బ్రెయిలీ లిపిలో ముద్రించిన కేసీఆర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన అంధులతో ఆ పుస్తకాన్ని చదివించుకొని అందులోని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

Source: Eenadu

మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, ప్రముఖ సినీనటుడు సూర్య కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సచిన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. సూర్యను కలవడం ఆనందాన్నిచ్చిందని తెలుపుతూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే తితిదే ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటిని సీఎం సత్కరించి వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహూకరించారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home