చిత్రం చెప్పే విశేషాలు..!
(19-02-2023/2)
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. జీపు, ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగులు, శ్రీవారి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
Source: Eenadu
శివాజీ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని కార్వాన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త తీసుకొచ్చిన కొత్త బీఎండబ్ల్యూ ద్విచక్రవాహనాన్ని నడుపుతూ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ర్యాలీ తీశారు.
Source: Eenadu
ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. భారత బ్యాటర్ పుజారాకు ఇది 100వ టెస్టు. ఈ సందర్భంగా తమ ఆటగాళ్లు సంతకం చేసిన ఆస్ట్రేలియా జెర్సీని కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. పుజారాకు అందించాడు.
Source: Eenadu
కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో ‘డైరెక్టర్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డుల’ ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి అమెరికా నటి ఔబ్రే ప్లాజా హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
కోల్‌కతాలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర జట్టు 9 వికెట్ల తేడాతో బెంగాల్‌ను ఓడించి రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా జయదేవ్‌తో పాటు టీమ్ సభ్యులు సంబరాల్లో మునిగితేలారు.
Source: Eenadu
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా నేడు కేరళ స్ట్రైకర్స్, తెలుగు వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అఖిల్ 30 బాల్స్‌లో 91 రన్స్ సాధించి తెలుగు వారియర్స్‌ను గెలిపించాడు. వెంకటేశ్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు.
Source: Eenadu
సూర్యాపేట జిల్లా మేల్లచెరువు గ్రామంలోని శంభు లింగేశ్వర శివాలయంలో ఆదివారం జాతర ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బండ లాగుడు పోటీల్లో పలువురు ఉత్సాహంగా పోటీపడ్డారు.
Source: Eenadu
తిరుమలలో శ్రీకపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పురుషామృగ వాహనంపై సోమస్కందమూర్తిని ఊరేగించారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Source: Eenadu