చిత్రం చెప్పే విశేషాలు..!
(24-02-2023/2)
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం "వటపత్ర శయనుడి" అలంకరణలో భక్తులకు లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిచ్చారు.
Source: Eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తిరుపతిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Source: Eenadu
త్రిగుణ్ హీరోగా ఆయాన్ బొమ్మాళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అవసరానికో అబద్దం’. సినిమా చిత్రీకరణను శుక్రవారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తిని రేకెత్తించే సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Source: Eenadu
మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ఆమె అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Source: Eenadu
రాయ్‌పుర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలకు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. దేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమావేశాల్లో కసరత్తు చేయనున్నట్లు పార్టీ అధిష్ఠానం తెలిపింది.
Source: Eenadu
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ఏడాది పూర్తయిన సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తి లండన్‌లో మౌనం పాటించారు. యుద్ధం త్వరగా ముగిసిపోయి శాంతి వాతావరణం నెలకొనాలని రిషి సునాక్ ఆకాంక్షించారు.
Source: Eenadu
క్రికెటర్ దినేశ్ కార్తిక్, సినీ నటుడు యశ్ కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్న దినేశ్.. ‘సలామ్ రాఖీ భాయ్’ అంటూ పోస్టు పెట్టారు.
Source: Eenadu
విజయవాడలోని ప్రసాదంపాడులో తెదేపా నాయకుడు శ్రీరామినేని రమేష్ కుమారుడు వినీష్ పెళ్లి ఈ రోజు రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో వరుడిని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారు.
Source: Eenadu