చిత్రం చెప్పే విశేషాలు..!

(28-02-2023/2)

మెగా హీరోలు పవన్ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కేతిక శర్మ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తదితరులు నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

నగర శివారులోని ఇబ్రహీంపట్నం చెరువు వద్ద మోదుగు చెట్టు విరగబూసింది. ప్రకృతికి వన్నె తెచ్చేలా ఈ చెట్టు అటు నుంచి వెళ్లేవారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

ఐఐటీ హైదరాబాద్‌లో ఈరోజు సైన్స్‌ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ కోసం ముందస్తుగా ఒక డార్క్స్‌కీ ల్యాబ్‌ను ప్రారంభించారు.

Source: Eenadu

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీలక్ష్మీనారసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో మంగళవారం జ్వాలా నరసింహస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పల్లకిలో కొలువుంచి ఉత్సవాలు జరిపించారు.

Source: Eenadu

ఈరోజు సైన్స్‌డే సందర్భంగా హైదరాబాద్‌ నల్లకుంటలోని ఓ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సైన్స్‌ ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలు ఆకట్టుకున్నాయి.

Source: Eenadu

యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ స్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామి వారికి శ్రీరామ అలంకరణ(హనుమంత సేవ)లో ఆలయ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

Source: Eenadu

హీరో నానీ ట్విటర్‌ వేదికగా ఓ అరుదైన ఫొటోను పోస్టు చేశారు. చిన్న కోడిపిల్లను చేతిలో పట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మై లిటిల్‌ కో స్టార్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. 

Source: Eenadu

ఈరోజు టైలర్స్ డే సందర్భంగా కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఔత్సాహికుడు అశోక్‌ శ్రీనాథ్‌ పెన్సిల్‌పై ఒక సెంటిమీటర్‌ కత్తెరను రూపొందించి ఆకట్టుకున్నాడు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(23-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

Eenadu.net Home