చిత్రం చెప్పే విశేషాలు..!
(01-03-2023/2)
‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం అమెరికాలో పర్యటిస్తున్న రామ్‌చరణ్.. ‘కేఎల్‌టీఏ’ ఎంటర్‌టైన్‌మెంట్ ఇంటర్వ్యూలో సందడి చేశారు. ఈ మేరకు చెర్రీ లేటెస్ట్ ఫొటోలను ఆయన సతీమణి షేర్ చేస్తూ.. ‘ఆన్ ఫైర్’ అని పేర్కొన్నారు.
Source: Eenadu
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామిని శ్రీ మహావిష్ణు అలంకరణలో గరుడవాహనంపై పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Source: Eenadu
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూలులో ప్రసంగించేందుకు లండన్ వెళ్లారు. గడ్డం ట్రిమ్ చేసుకుని డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Source: Eenadu
‘ఆర్‌ఆర్‌ఆర్’కు మరో విశేష గౌరవం దక్కింది. ‘ఆస్కార్’ వేదికపై ‘నాటు నాటు’పాడే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో రామచరణ్ ముచ్చటించారు.
Source: Eenadu
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 కిలోల బంగారు కిరీటాన్ని స్వామివారికి వారు అలంకరించారు.
Source: Eenadu
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సీపీఆర్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మేడ్చల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు సీపీఆర్ చేసే విధానాన్ని వైద్యుల వద్ద తెలుసుకొని.. మనిషి నమూనాపై సాధన చేశారు.
Source: Eenadu
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్ వేదికగా పంచుకుంది.
Source: Eenadu
క్రికెటర్ యజువేంద్ర చాహల్.. రవిశాస్త్రితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్టు కింద ఫ్యాన్స్ లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Source: Eenadu
రవితేజ హీరోగా సుధీర్‌వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 6న ఉదయం 10.08గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘రావణాసుర’ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Eenadu