చిత్రం చెప్పే విశేషాలు!
(03-03-2023/2)
విశాఖలో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ముచ్చటించారు.
Source: Eenadu
చిరంజీవి హీరోగా కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయవంతంగా 50రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ట్విటర్ వేదికగా ఈ ఫొటోను పంచుకుంది.
Source: Eenadu
గోపీచంద్ హీరోగా నిమ్మ హర్ష దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ను నేడు పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు.
Source: Eenadu
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను అమెరికాలోని ఏస్ హోటల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాకు అక్కడి అభిమానులు ముగ్ధులై రామ్‌చరణ్, రాజమౌళిని కొనియాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోను చెర్రీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
Source: Eenadu
భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో ఆలయ అర్చకులు 12 సువర్ణ దివ్య వాహనాలను ప్రతిష్ఠించారు. ప్రవాస భారతీయ వాసవీ సంఘం ఆధ్వర్యంలో రూ.67లక్షల వ్యయంతో బంగారు పూతతో తయారు చేయించిన ఈ 12 వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు.
Source: Eenadu
గుండెపోటుతో మృతి చెందిన తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి కుటుంబాన్ని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అర్జునుడి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.
Source: Eenadu
తనకు కాబోయే సతీమణి భూమా మౌనికా రెడ్డి ఫొటోను మంచు మనోజ్ శుక్రవారం ఉదయం ట్విటర్ వేదికగా షేర్ చేశాడు. ‘‘పెళ్లికూతురు భూమా మౌనికా రెడ్డి’’ అని పేర్కొన్నాడు. దీనిని చూసిన సినీ ప్రియులు ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Source: Eenadu
‘కిసాన్ అగ్రి షో’ 32వ ఎడిషన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రారంభించారు. పలు వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, నీటిపారుదల సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శించారు. వాటిని మంత్రి పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు.
Source: Eenadu
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పీటర్సన్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ప్రధాని తన పుట్టిన రోజున చీతాలను తీసుకురావడం హర్షించదగిన విషయమని తెలిపారు.
Source: Eenadu